మహిళ కిడ్నాప్.. నిర్బంధించి అత్యాచారం..

మహిళ కిడ్నాప్.. నిర్బంధించి అత్యాచారం..

హైదరాబాద్ పాతబస్తీలో ఓ మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఇందిరానగర్ కు చెందిన నర్సింహ ఓ మహిళను కిడ్నాప్ చేసి.. బస్తీలోని ఓ ఇంట్లో నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతలో ఇంటి యజమాని వచ్చాడు. తలుపులు బాదినా తెరవకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. మహిళపై అత్యాచారం చేస్తున్న దృశ్యాలను ఫోన్ లో రికార్డు చేసి.. పోలీసులకు అప్పగించారు జనం. ఇంటి యజమానికి మద్దతుగా బస్తీవాసులంతా వచ్చి ఆందోళనకు దిగారు. పోలీసులు వారికి సర్థిచెప్పారు. కామాంధుడు నర్సింహపై గతంలో రెండు హత్య కేసులతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు పోలీసులు.