అసహజ శృంగారం కోరిన భర్త...భార్య ఏం చేసిందంటే ?

అసహజ శృంగారం కోరిన భర్త...భార్య ఏం చేసిందంటే ?

నిద్రపోతూ మంచంపై నుంచి పడిపోయిన భర్తలో చలనం లేదంటూ ఓ స్కూల్ టీచర్.అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళింది. వైద్యులు ఆయన అప్పటికే చనిపోయడని ధ్రువీకరించారు. అయితే అది సహజ మరణమే అని అనుకునేలోపే విషయం పోలీసుల చెవిన పడింది. వైద్యుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా అతని మర్మాంగాలపై గాయాలు కనిపించాయి. అక్కడ ఎవరు కొట్టి ఉంటారన్న దిశగా ఆరా తీయడంతో భార్య ఘాతుకం బయటపడింది. భార్యే భర్తని కిరాతకంగా హత్య చేసిందని తేల్చారు. వివరాల్లోకి వెళ్తే తమిళనాడు తిరుమంగళంకి చెందిన ఓ వ్యక్తీ సర్వే డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాడు.

అతనికి స్కూల్ టీచర్‌ అయిన యువతీతో పెళ్లయింది. వారికి ఒక పాప కూడా , మొన్న అతను మంచం మీద నుండి కింద పడి లేవడం లేదని ఆస్పత్రికెళ్లింది భార్య. అనుమానం రావడంతో పోలీసులకి సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా ప్రైవేట్‌ పార్ట్స్‌పై ఎవరో గాయపరిచారు. భార్యను తమ స్టైల్లో విచారించడంతో షాకింగ్ నిజాలు వెల్లడించింది. రోజూ తాగొచ్చి కొట్టేవాడని సెక్స్ కోసం పిచ్చెక్కిపోయే అతను అసహజ శృంగారం కోసం హింసించేవాడని ఆమె చెప్పింది. ఆయన్ని చంపేయాలని నిర్ణయించుకుని పాలల్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి నిద్ర పోగానే తన బంధువుల సాయంతో అంతమొందించినట్లు అంగీకరించింది. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు.