మరిదితో 'ఆ' సంబంధం… ప్లాన్ చేయించి మరీ భర్తను లేపేసింది !

మరిదితో 'ఆ' సంబంధం… ప్లాన్ చేయించి మరీ భర్తను లేపేసింది !

ప్రియుడి పై వున్న మోజుతో తాళికట్టిన భర్తను భార్య హత్య చేయించిన సంఘటనలో సుబేదారి పోలీసులు మొత్తం నలుగురు నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల నుండి ఒక కారు నాలుగు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమీషనర్ పి.ప్రమోద్ కుమార్ వివరాలను వెల్లడించారు. జనవరి నెల 24 తేదిన వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన తాళ్ళ పల్లి అనిల్ అనే వ్యక్తి కనబడటం లేదని అతని భార్య తాళ్ళపల్లి పూజిత ఇచ్చిన ఫిర్యాదుపై మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నామని అన్నారు. పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్న సమయంలో కనబడకుండా పోయిన అనిల్ జనవరి 29వ తేదీన రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్ లో శవమై కనిపించాడని అన్నారు.

అనిల్ మరణం మీద మృతుడి భార్య పూజిత హస్తం ఉందేమో అని బంధువులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక దృష్టిసారించి విచారణ చేపట్టడం జరిగిందని అన్నారు. పోలీసుల దర్యాప్తులో మృతుడి మరణానికి కారణం భార్య పూజితకి మృతుడి తమ్ముడు అయిన  హన్మకొండ డానీతో ఉన్న అక్రమ సంబందమే అని తేలింది. 2018 సంవత్సరంలో అనిల్  కి వరుసకు తమ్మడైన హన్మకొండ డ్యాని వద్ద అనీల్ తన ట్రాలీ ఆటోను తనాఖా పెట్టి లక్ష రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. ఈ క్రమంలో డ్యానీ ప్రతి రోజు అనిల్ ఇంటికి వెళ్ళి అప్పు వాయిదా పద్ధతిలో డబ్బును తీసుకొనేవాడు. ఇదే క్రమములో నిందితుడికి, మృతుడు భార్య పూజితకు మధ్య పరిచయం కావడంతో వీరి మధ్య పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది.

దీంతో నిందితులు శారీరకంగా కలుసుకోనేందుకుగాను నిందితుడు డ్యానికి అక్కయిన మరో నిందితురాలు సుధామణి తన ఇంటిలోనే ఏర్పాటు చేసి వీరికి సహకరించేది. ఈ క్రమములో "మన ఇద్దరి విషయం నాభర్తకు తెలిసినట్లు వుంది. అందుకే రోజు కారణం లేకుండా గోడవపడుతున్నాడని, ఇకపై అతనితో కాపురం చేయలేనని, నా భర్తను చంపి అడ్డు తొలగించుకుంటే మనమిద్దరం కల్సి జీవించవచ్చ"ని నిందితురాలు పూజిత డ్యానికి సూచించింది. దీంతో గత జనవరి 22వ తేదీన తన భర్త అనిల్ హైదరాబాదు వెళ్ళినట్లుగా డ్యానీకి తెలిపింది. వంద ఫీట్ల రోడ్డు మార్గం వద్ద కారులో వచ్చిన డ్యానీని కలుసుకున్న పూజిత తన భర్తను చంపాల్సిందిగా సూచించడంతో డ్యానీ తన అన్న అనిల్ ను చంపేందుకు నిర్ణయించుకున్నాడు. అనిల్ ను చంపేందుకుగాను తనకు వరుసకు తమ్మడైన హన్మకోండ సతీష్ సహకారం తీసుకున్నాడు. అనిల్ హన్మకొండకు తిరిగి వస్తున్నట్లుగా డ్యానీకి పూజిత సమాచారం ఇవ్వడంతో కాజీపేట్ ఫాతీమా జంక్షన్ వద్ద కారులో చేరుకోని వేచి ఉన్నారు. ఫాతీమా జంక్షన్ వద్ద బస్సు దిగి ఆటోలో ఇంటికి బయలుదేరిన మృతుడిని నిందితులు డ్యానీ, సతీష్ కారులో వెంబడించగా, వడ్డెపల్లి చర్చ్ వద్ద దిగిన మృతుడు అనిల్ ను నిందతులు పనివుందని కారులో ఎక్కించుకోని  అవుటర్ రింగ్  రోడ్డు మీదకు చేరుకోని అక్కడే కారులోనే మృతుడుతో కల్సిన మద్యం సేవించారు.

రాత్రి 10.30 గంటల సమయంలో నిందితులు ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం అనిల్ ని కారులో ఎక్కించుకోని భీమారం మీదుగా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ కెనాల్ వద్ద చేరుకోని నిందితులిద్దరు కల్సి నిల్ ను తీవ్రంగా కొట్టడంతో పాటు, అనిల్ ఒంటిపై వున్న చొక్కాను విప్పి చొక్కాతోనే అనిల్ గోంతుని బిగించి హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు అనిల్ మృతదేహాన్ని కెనాల్ లో పడవేశారు. తామే హత్య చేసినట్లుగా ఎవరికీ అనుమానం రాకుండా వుందేంకుగాను తన భర్త కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందిగా నిందితులు మృతుడి భార్యకు సూచించడంతో ప్రధాన నిందితురాలు పూజిత తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఈ వ్యవహారం బయట పడింది.