కళ్లల్లో కారం కొట్టి.. గొంతు నులిమి హత్య 

కళ్లల్లో కారం కొట్టి.. గొంతు నులిమి హత్య 

మహిళ కళ్లల్లో కారం కొట్టి, హత్య చేసి బీభత్సం సృష్టించారు దోపిడీ దొంగలు. హైదరాబాద్‌లోని అమీన్‌పూర్‌లో ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను హత్య చేసి ఆమె ఇంట్లోని నగలు, నగదు దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

హైదరాబాద్ శివార్లలోని అమీన్ పూర్ సాయివాణికాలనీలో డాక్టర్ సురేందర్ గౌడ్ ఇంటిని దోచుకునేందుకు వెళ్లారు దొంగలు. ఇంటి వెనుకవైపున గేటు నుంచి లోపలికి చొరబడ్డారు. గౌడ్‌ భార్య అరుంధతి  ఒంటరిగా పూజా మందిరంలో ఉండగా.. దొంగలు ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగారు. ఇంట్లోని బంగారం, డబ్బంతా ఇవ్వకపోతే చంపేస్తామని  బెదిరించారు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన అరుంధతి కళ్లల్లో కారం చల్లారు. కేకలు వేస్తుందేమోనని భయపడ్డ దొంగలు ఆమె గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశారు. డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరుకున్న డాక్టర్ సురేందర్ గౌడ్ అరుంధతి మృతదేహాన్ని చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.