హర్యానాలో యువతి దారుణ హత్య... లవ్ జీహాదే కారణమా..!!

హర్యానాలో యువతి దారుణ హత్య... లవ్ జీహాదే కారణమా..!!

దేశంలో  మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది.  మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నా మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఏ మాత్రం తగ్గడం లేదు.  హర్యానాలోని ఫరీదాబాద్ లో బికాం ఫైనల్ ఇయర్ చదువుతున్న నిఖిత అనే యువతిని ఓ యువకుడు దారుణంగా కాల్చి చంపాడు.  నిఖిత పరీక్ష రాసి కాలేజీ నుంచి బయటకు వస్తుండగా ఈ ఘటన జరిగింది.  నిఖిత కాలేజీ నుంచి బయటకు రాగానే ఆమె స్నేహితుడైన తౌసీఫ్ మరో వ్యక్తితో కలిసి కారులో కిడ్నాప్ చేయాలని చూశాడు.  బాధిత యువతి ప్రతిఘటించింది.  దీంతో తౌసీఫ్ తన  దగ్గర ఉన్న రివాల్వర్ తో నిఖితను కాల్చాడు.  దీంతో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది.  ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  బాధితురాలి తండ్రి వివరాల ప్రకారం, బాధితురాలు నిఖితను నిందితుడు తౌసీఫ్ ఇస్లాం మతంలోకి మార్చాలని బలవంతం చేసినట్టు పేర్కొన్నారు. అనేకమార్లు నిఖిత నిరాకరించిందని, కిడ్నాప్ చేసి బలవంతంగా మతం మార్చాలని చూశాడని, కుదరకపోవడంతో నిఖితను చంపేశాడని బాధితురాలి తండ్రి పేర్కొన్నాడు.  హర్యానాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.  నిందితులను వెంటనే ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్ పెరుగుతున్నది.  బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. యువతి హత్యకు సంబంధించిన సిసిటీవీ ఫుటేజ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.