నడిరోడ్డుపై మహిళ ప్రైవేట్ పార్ట్ పట్టుకున్న పోకిరి... ఆ మహిళ ఏం చేసిందటే...!!

నడిరోడ్డుపై మహిళ ప్రైవేట్ పార్ట్ పట్టుకున్న పోకిరి... ఆ మహిళ ఏం చేసిందటే...!!

మహిళలు రోడ్డుపై ఒంటరిగా కనిపిస్తే పోకిరీలు తుంటరి పనులు చేయడం షరా మామూలైపోయింది.  ఒంటరిగా రోడ్డు మీద వెళ్తుంటే ఏదొక విధంగా వారిని టచ్ చేయాలనీ చూస్తుంటారు.  ఇలానే కోల్ కతా రోడ్డుమీద ఒంటరిగా వెళ్తున్న ఓ మహిళను ఆకతాయి ఏడిపించడం మొదలుపెట్టాడు.  అక్కడితో ఆగకుండా ఆమె  ప్రైవేట్ పార్ట్ లను తాకడంతో షాక్ అయ్యింది.  వెంటనే ఆమె బ్యాగ్ లాక్కొని పారిపోవాలని చూశాడు.  ప్రమాదాన్ని గమనించిన ఆ మహిళ అలర్ట్ అయ్యింది.  వెంటనే పోకిరి చెంప పగలగొట్టింది.  దీంతో ఆ పోకిరి ఆక్కడి నుంచి పారిపోయాడు.  కానీ, ఆ మహిళ వదలలేదు.  అతడికోసం వెతకడం మొదలుపెట్టింది.  చుట్టుపక్కల ఉన్న వారిని వివరాలు అడిగి తెసుసుకొని, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.  దీంతో పోలీసులు ఆ పోకిరిని పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు.  ధైర్యంగా వ్యవహరించిన మహిళలకు పోలీసులు సెల్యూట్ చేశారు.