వీడియో: పాపం.. గుడిలో చీరెకు నిప్పంటుకుంది

వీడియో: పాపం.. గుడిలో చీరెకు నిప్పంటుకుంది

కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఉన్న విశ్వనాథ మందిరంలో పూజ చేయించుకోడానికి వెళ్లిన ఒక మహిళ చీరకు నిప్పంటుకుంది. అక్కడ వెలుగుతున్న కొవ్వొత్తి ఆమె చీర అంచుకు తాకడంతో ఉవ్వెత్తున మంటలు ఎగశాయి. ఈ సంఘటన జూన్ 17న మధ్యాహ్నం 12.40 గంటలకు జరిగింది. ఈ సంఘటన మొత్తం అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ మహిళకు మంటల కారణంగా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ మహిళ పేరు ఛాయగా తెలిసింది.ఆమెను కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.

ఇవాళ మీడియాలో బయటపడ్డ సీసీటీవీ ఫుటేజీలో ఆ మహిళ మంటలతోనే పరుగులు పెడుతూ కనిపించింది. చీరకు నిప్పంటుకోగానే సాయం కోసం అరుస్తోంది. ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల జనం సాయానికి వచ్చారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. తర్వాత ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై దేవాలయ అధికార వర్గాలు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.