ప్రియుడు మరణించిన 4 రోజులకు యువతి ఆత్మహత్య

ప్రియుడు మరణించిన 4 రోజులకు యువతి ఆత్మహత్య

జీవితాంతం కలిసి ఉండాలనుకున్న ఆ ఇద్దరూ నాలుగు రోజుల తేడాలో ప్రాణాలు తీసుకున్నారు. కారణాలేవైనా.. కన్నీళ్లు పెట్టించే ఈ ఘటనలు హైదరాబాద్‌లో చోటుచేసుకున్నాయి. పంజాగుట్ట పరిధిలోని ఓ హాస్టల్లో ఉంటున్న రియాసేన్‌ అనే యువతి ఇవాళ ఆత్మహత్య చేసుకుంది. రియాసేన్‌ ప్రియుడు నాలుగు రోజుల క్రితం ఎస్ఆర్‌ నగర్‌ హాస్టల్లో ప్రాణాలు తీసుకున్నాడు. ప్రియుడు మరణించినప్పటి నుంచి తీవ్ర వేదనకు గురైన రియాసేన్‌... ఇవాళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.