టీవీ చూస్తోందని కూతురిని కొట్టి చంపిన టీచర్..

టీవీ చూస్తోందని కూతురిని కొట్టి చంపిన టీచర్..

ఆమె ఓ ఉపాధ్యాయురాలు.. ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమె.. నిత్యం వందల మంది విద్యార్థులను సముదాయించాల్సి ఉంటుంది. కానీ, తన కూతురు విషయంలోనే తన కోపాన్ని ఆపుకోలేకపోయింది. చదవకుండా టీవీ చూస్తోందని కన్న కూతురిని ఆ తల్లి దారుణంగా కొట్టి చంపింది. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా కాట్టుపుదూర్‌లో ఈ దారుణం జరిగింది. గవర్నమెంట్ టీచర్‌ అయిన నిత్యకమల.. తన ఐదేళ్ల కుమార్తె లతికా శ్రీని చదువుకోవాలని కోరింది.. ఆ చిన్నారి అంతగా పట్టించుకోకుండా టీవీ చూస్తూ ఉండిపోయింది. దీంతో కోపంతో ఊగిపోయిన నిత్య కమల.. చదవడంలేదని తన కూతురిని దారుణంగా కొట్టింది. దీంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.