సీజేఐ లైంగిక వేధింపుల కేసు: దర్యాప్తు నుంచి తప్పుకున్న ఫిర్యాదీ మహిళ

సీజేఐ లైంగిక వేధింపుల కేసు: దర్యాప్తు నుంచి తప్పుకున్న ఫిర్యాదీ మహిళ

చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పై కేసు పెట్టిన మహిళ దర్యాప్తులో పాల్గొనేందుకు నిరాకరించారు. ముగ్గురు జడ్జిల ఇన్ హౌస్ ప్యానెల్ దర్యాప్తులో పాల్గొనబోనని ఆమె చెప్పారు. ముగ్గురు జడ్జిల ఈ ప్యానెల్ తో తనకు న్యాయం జరుగుతుందని భావించడం లేదని ఫిర్యాదీదారు పేర్కొన్నారు. ఈ కేసులో మూడో విచారణ మంగళవారం జరుగుతోంది. దీని తర్వాత సుప్రీంకోర్ట్ ఉద్యోగిని తను దర్యాప్తులో పాల్గొనడంపై భయపడుతున్నట్టు తెలిపారు. ఆమె ఒక పత్రికా ప్రకటనలో దీని గురించి సమాచారం ఇచ్చారు.

తను కోరినట్టు బయటి కమిటీ కాకుండా సీజేఐ జూనియర్లయిన సిట్టింగ్ జడ్జిలతో ఇన్ హౌస్ కమిటీ ఎదుట హాజరయ్యానని ఆమె తెలిపారు. కమిటీలో వాతావరణం భయపెట్టేలా ఉందని.. తన లాయర్/మద్దతిచ్చే వ్యక్తి లేకుండా ముగ్గురు సుప్రీంకోర్ట్ జడ్జిల ప్రశ్నలు ఎదుర్కొనడం బెరుగ్గా అనిపించిందని చెప్పారు. అలాగే ఈ ప్రొసీడింగ్స్ ఆడియో, వీడియో రికార్డింగ్ జరగడం లేదని.. తను కోరినట్టుగా వాంగ్మూలం తాలుకు ప్రతులను అందజేయలేదని ఆమె ఆరోపించారు. 

సీజేఐ రంజన్ గొగోయ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన కమిటీ నుంచి జస్టిస్ ఎన్ వి రమణ వైదొలిగారు. ఆ తర్వాత జస్టిస్ ఇందు మల్హోత్రాని ప్యానెల్ లో మూడో సభ్యురాలిగా చేర్చడం జరిగింది. ఇప్పుడు సీజేఐ కేసు దర్యాప్తు చేస్తున్న సుప్రీంకోర్ట్ ఇన్ హౌస్ ప్యానెల్ లో ఇద్దరు మహిళా జడ్జిలు ఉన్నారు. సీజేఐ రంజన్ గొగోయ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను అంతర్గత దర్యాప్తునకు మంగళవారం సుప్రీంకోర్ట్ సీనియర్ జడ్జి జస్టిస్ ఎస్ఏ బోబ్డే అధ్యక్షతన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.

జస్టిస్ బోబ్డేతో పాటు ఈ కమిటీలో సుప్రీంకోర్ట్ ఇద్దరు జడ్జిలు జస్టిస్ ఎన్ వి రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీ ఉన్నారు. ఈ ప్యానెల్ లో జస్టిస్ రమణను చేర్చడంపై బాధిత మహిళ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన వైదొలిగారు. జస్టిస్ రమణ చీఫ్ జస్టిస్ కు అత్యంత సన్నిహితుడని ఆ మహిళ పేర్కొన్నారు.