అయ్యప్పను దర్శించుకున్న కోడలిపై అత్తదాడి..!

అయ్యప్పను దర్శించుకున్న కోడలిపై అత్తదాడి..!

కేరళలోని శబరిమల ఆలయంలోకి వెళ్లి అయ్యప్పను దర్శించుకున్న మహిళలకు వేధింపులు ఎక్కువయ్యాయి... ఈ నెల 2వ తేదీన శబరిమల ఆలయంలోకి 40 ఏళ్ల బిందు అమ్మినితో పాటు 39 ఏళ్ల కనకదుర్గ ప్రవేశించారు... అయితే సొంత కుటుంబసభ్యులే కనకదుర్గను దారుణంగా చిత్రహింసలు పెట్టినట్టు తెలుస్తోంది. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నప్పటి నుంచి రహస్య ప్రాంతంలో ఉన్న కనకదుర్గ ఇవాళ ఇంటికి చేరుకున్నారు. శబరిమల ఎందుకు వెళ్లావంటూ ఆమె అత్త కనకదుర్గపై దాడి చేసింది. కర్రతో చితకబాదింది... తీవ్రంగా గాయపడిన కనకదుర్గను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కనకదుర్గ అత్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, కనకదుర్గ, బిందు అమ్మిని అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ఆలయం అపవిత్రమైందంటూ తలుపులు మూసేసిన పూజారులు సంప్రోక్షణ అనంతరం గుడి తలుపులు తెరిచిన సంగతి తెలిసిందే... ఈ ఘటన తర్వాత కేరళలో బంద్.. హింసకు దారి తీసింది.