వీడియో వైరల్ : ప్రపంచంలోనే పొడవైన గోళ్లు... కానీ కట్ చేసేస్తున్నారుగా...!!

వీడియో వైరల్ : ప్రపంచంలోనే పొడవైన గోళ్లు... కానీ కట్ చేసేస్తున్నారుగా...!!

ప్రపంచంలోనే పొడవైన చేతి గోళ్లను కలిగిన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించుకున్న అయన్నా విలియమ్స్ తాజాగా వాటిని కత్తిరించింది. 30 సంవత్సరాలలో అయన్నా తన గోళ్లను కత్తిరించడం ఇదే మొదటిసారి. 1990 నుంచీ తన చేతి గోళ్లను పెంచుతున్నట్టు స్పష్టం చేశారు అయన్నా. 2017లో వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది. అప్పుడు అయన్నా విలియమ్స్ చేతి గోళ్లు దాదాపు 576.4 cm (18 ft 10.9 in). అప్పట్లో ఆమెకు మెనిక్యూర్ చేయడానికి రెండు సీసాల నెయిల్ పాలిష్ తో 20 గంటల సమయం పట్టిందట. అయితే అయన్నా తాజాగా తన రికార్డును తానే బ్రేక్ చేసింది. బుధవారం రోజున అయన్నా చేతి గోళ్లను కత్తించారు. కత్తిరించేముందు ఆమె గోళ్ళు 733.55 cm (24 ft 0.7 in) ఉన్నాయి. అమెరికాలోని టెక్సాస్, ఫోర్త్ వర్త్‌లోని ట్రినిటీ విస్టా డెర్మటాలజీకి చెందిన డాక్టర్ అల్లిసన్ రీడింగర్ ఆమె గోళ్లను కత్తిరించారు, డాక్టర్ అల్లిసన్... అయన్నా పొడవాటి గోళ్లను ఎలా కత్తిరించాడో చూపిస్తూ ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు యూట్యూబ్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ పంచుకుంది. అయన్నా గోళ్లను కత్తిరించడానికి డాక్టర్ ఎలక్ట్రిక్ రోటరీ టూల్ ను వాడారు. అయితే గోళ్లను కత్తిరిస్తున్న సమయంలో అయన్నా "గోళ్లు ఉన్నా, లేకపోయినా నేను క్వీన్ నే..." అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. గోళ్లను పెంచుతూ తదుపరి చరిత్ర సృష్టించే ఔత్సాహికులకు ప్రోత్సాహం అందించడమే తన లక్ష్యమని ఆమె చెప్పుకొచ్చారు. అయన్నా విలియమ్స్ టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో నివసిస్తున్నారు. 

 

కాగా గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రకారం పొడవైన చేతి గోళ్లను కలిగిన మహిళ రికార్డు ఇప్పటికీ... యూఎస్ లోని ఉటాకు చెందిన లీ రెడ్‌మండ్‌ దే. ఆమె చేతి గోళ్లు 8.65 m (28 ft 4.5 in). కానీ దురదృష్టవశాత్తూ 2009లో జరిగిన ఓ యాక్సిడెంట్ లో లీ ప్రాణాలు కోల్పోయారు.