మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు…

మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు…

ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ క్యాజువల్ లీవును ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీచేశారు. మహిళా ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అన్నారు. మరోవైపు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టీవో ఆఫీసులలో డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహిస్తుస్తున్నారు. మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ జే.పాండురంగ నాయక్ కోరారు. అయితే రవాణా శాఖ మహిళా ఉద్యోగులకు సెలవును ప్రకటించాం అని.. ఈ రోజు వారు సేవలందించేందుకు వస్తే ఏమీ అభ్యంతరం లేదని అన్నారు.