మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడు

మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడు

పవిత్రమైన వైద్య వృత్తికే చెడ్డపేరు తీసుకువచ్చాడో ఓ ప్రబుద్ధుడు. వైద్యం కోసం వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి చిలుకానగర్ బస్తీలోని ఆసుపత్రిలో చోటు చేసుకుంది. తలనొప్పితో బాధపడుతున్న పుష్ప అనే మహిళ డాక్టర్ బాలరాజు వద్దకు వైద్యం కోసం వచ్చింది. తలకు మసాజ్ చేస్తూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. మళ్లీ రెండు రోజుల తరువాత రావాలని చెప్పాడు. వైద్యుని అసభ్య ప్రవర్తనను గమనించిన సదరు మహిళ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో డాక్టర్ బాలరాజును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.