లిఫ్ట్‌లో కాలు ఇరుక్కుని మహిళ మృతి

లిఫ్ట్‌లో కాలు ఇరుక్కుని మహిళ మృతి

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుకలో ఓ మహిళ మృతి చెందింది. స్థానిక బండ్లగూడ జాగీర్ రాధా నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిన్న ఓ వివాహం జరిగింది. ఈ వివాహానికి వచ్చిన బంధువుల్లోని ఓ మహిళ లిఫ్ట్ ఎక్కగా.. లిఫ్ట్‌లో కాలు ఇరుక్కుపోయింది. ఈక్రమంలో ఆమె మరణించింది. విషయం తెలుసుకున్న ఫంక్షన్ హాల్ యజమాని పరారయ్యాడు. రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.