దానం చేయండి అంటూ వచ్చి... దోచేస్తున్నారు...!!

దానం చేయండి అంటూ వచ్చి... దోచేస్తున్నారు...!!

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో దొంగల ముఠా రెచ్చిపోతున్నది.  రాజస్థాన్, బీహార్ కు చెందిన దొంగల ముఠా నగరంలోని వివిధ షాపుల్లో దొంగతనాలు చేస్తున్నారు.  దానం చేయండి అంటూ లోపలి వచ్చి, షాపు యజమానిని ఏమార్చి డబ్బులు దోచేస్తున్నారు.  పిల్లలతో కలిసి వచ్చిన ముఠా తెలివిగా దొంతనం చేస్తున్నాయి.  అయితే, ఈ దృశ్యాలు షాపులోని సిసిటీవీ ల్లో రికార్డ్ కావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.  ముసుగేసుకుని వచ్చే ముఠాపై నగరంలోని అన్ని షాపులను అలర్ట్ చేశారు.  దానం చేయండి అంటూ వచ్చిన వారిపై సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.  నగరంలోని లక్ష్మి స్టీల్, సప్తగిరి ఎలక్ట్రానిక్స్ షాపుల్లో ఈ ముఠా ఇప్పటికే చోరీకి పాల్పడింది.