మీరట్ లో మరో నిర్భయ ఘటన... కదులుతున్న బస్సులో... 

మీరట్ లో మరో నిర్భయ ఘటన... కదులుతున్న బస్సులో... 

ఢిల్లీ నిర్భయ సంఘటన దేశాన్ని ఎంతగా కదిలించిందో అందరికి తెలిసిందే.  నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన దోషులను ఇటీవలే ఉరి తీశారు.  నిర్భయ ఘటన తరువాత అలాంటి ఘటనలు జరగలేదని చెప్పాలి.  తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో నిర్భయ లాంటి ఘటనా మరొకటి జరిగింది.  కదులుతున్న బస్సులో ఓ యువతిని నిర్బంధించి అత్యాచారం చేశారు.  అనంతరం ఆమెను బస్సులో నుంచి తోసేసి వెళ్లిపోయారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.  ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ బైసాలి బస్టాండ్ లో బాధితురాలు బస్సు ఎక్కింది.  బస్సు సిబ్బంది ఇచ్చిన కూల్ డ్రింక్ తాగి స్పృహ కోల్పోయింది.  స్పృహ కోల్పోయిన యువతిపై బస్సు డ్రైవర్, కండెక్టర్ లు ఆత్యాచారం చేసినట్టు యువతి పేర్కొన్నది.  నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.