పోలీస్‌ స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం..

పోలీస్‌ స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం..

పోలీసులు తనకు న్యాయం చేయలేదంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయడం నంద్యాలలో కలకలం సృష్టించింది. కర్నూలు జిల్లా నంద్యాల, అయ్యలూరుకు చెందిన శివమ్మ... స్థలం విషయంలో పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. అయితే, ఆ స్థలం విషయంలో పోలీసులు తనకు న్యాయం చేయలేదని మనస్తాపం చెందిన శివమ్మ... నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.