మహిళా దినోత్సవం రోజే యువతి ఆత్మహత్య...

మహిళా దినోత్సవం రోజే యువతి ఆత్మహత్య...

రాజేంద్రనగర్ మైలార్ దేవర్ పల్లి లోని లక్ష్మీ గూడలో విషాదం చోటుచేసుకుంది. మహిళ దినోత్సవం రోజే ఆత్మహత్య కు పాల్పడ్డింది ఓ యువతి. అష్రాఫ్ అనే యువకుడు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది యువతి లిజా. బ్యూటీషన్ గా పని చేస్తున్న లిజాను గత కొద్దిరోజులుగా ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు అష్రాఫ్. అయితే ఆ వేధింపులు తాళలేక నిన్న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది లిజా. అయితే ఈ ఘటన తర్వాత అష్రాఫ్ పరారయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మైలార్ దేవిపల్లి పోలీసులు. ఫరారీ లో ఉన్న అష్రాఫ్ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు పోలీసులు.