మహిళల ఆర్చరీలో రజతం

మహిళల ఆర్చరీలో రజతం

ఆసియా క్రీడలలో భారత్ కు మరో రజత పతకం దక్కింది. అద్భుత ప్రతిభతో ఫైనల్ చేరిన భారత మహిళా ఆర్చరీ జట్టు, ఫైనల్‌లో దక్షిణ కొరియా చేతిలో పోరాడి ఓడింది. చివరి దాకా పోరాడిన జ్యోతి సురేఖ నేతృత్వంలోని ఆర్చరీ టీం, వెంట్రుకవాసిలో స్వర్ణ పతకాన్ని చేజార్చుకుంది. దక్షిణ కొరియా చేతిలో 231- 228 పాయింట్ల తేడాతో ఓడిన ఆర్చరీ జట్టు, సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకుంది.

భారత మహిళా ఆర్చరీ జట్టు ఆరంభంలో అద్భుతంగా గురి చూసి కొట్టింది. తొలి రౌండ్‌లో 30 పాయింట్లు సాధించి స్వర్ణంపై ఆశలు రేపింది. దక్షిణ కొరియా, భారత్ జట్ల మధ్య చివరి దాకా హోరాహోరీగా పోటీ సాగింది. చివరి రౌండ్‌లో భారత్ విజయానికి 30 పాయింట్లు కావాల్సి ఉండగా భారత జట్టు 27 పాయింట్లే సాధించగలిగింది. కేవలం 3 పాయింట్ల తేడాతో స్వర్ణపతకం మిస్సయింది.