మహిళల ఐపీఎల్ కూడా యూఏఈ లోనే... ఎప్పటి నుండి అంటే..

మహిళల ఐపీఎల్ కూడా యూఏఈ లోనే... ఎప్పటి నుండి అంటే..

కరోనా కారణంగా వాయిదా పడిన పురుషుల ఐపీఎల్ సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు జరుగుతుంది అని ఈ రోజు జరిగిన ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సమావేశానికి వెళ్ళడానికి ముందు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడుతూ.. మహిళల ఐపీఎల్ కూడా జరుగుతుంది అని చెప్పారు. ఇక ఈ  విషయం పైన కూడా ఈ సమావేశంలో చర్చించిన బీసీసీఐ అధికారులు పురుషుల ఐపీఎల్ ముగిసే చివరి 10 రోజులు అంటే నవంబర్ 1-10 వరకు యూఏఈ వేదికగానే మహిళల ఐపీఎల్ జరుగుతుంది అని ప్రకటించారు. ఇక గత సీజన్ లో ఈ లీగ్ లో కేవలం 3 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. కానీ  ఈ ఏడాది మాత్రం 4 జట్లతో ఈ లీగ్ నిర్వహించనున్నట్లు దాదా ఇంతకముందే చెప్పారు. ఇక పురుషుల ఐపీఎల్ కు ఏ విధమైన కరోనా నియమాలు వర్తిస్తాయో మహిళల ఐపీఎల్ కు కూడా అవే నియమాలు వర్తిస్తాయి. అయితే పురుషులు మాత్రం ఆగస్టు 26 న యూఏఈ కి వెళ్తుండగా మహిళల ప్రయాణం ఎప్పుడు అనేది ఇంకా  నిర్ధారించలేదు.