మహిళల టీ20 ఛాలెంజ్ః వెలాసిటీ టార్గెట్ ఎంతంటే.. 

మహిళల టీ20 ఛాలెంజ్ః వెలాసిటీ టార్గెట్ ఎంతంటే.. 

జైపూర్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మహిళల టీ20 ఛాలెంజ్ లో భాగంగా వెలాసిటీతో జరుగుతున్న మ్యాచ్‌లో ట్రయల్‌ బ్లేజర్స్‌ 112 పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ట్రయల్‌ బ్లేజర్స్‌కు శుభారంభం దక్కలేదు. స్మృతి మంధాన 10 పరుగులకే ఔటైంది. తరువాత హర్లీన్‌ డియోల్‌ (43; 40 బంతుల్లో 5ఫోర్లు), సుజీ బేట్స్‌ (26; 22 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఏక్తా బిష్ఠ్‌, అమెలియా కెర్‌ చెరో రెండు వికెట్లు తీశారు. అయితే ట్రయల్‌ బ్లేజర్స్‌కు స్మృతి మంధాన, వెలాసిటీకి మిథాలీ రాజ్‌ సారథ్యం వహిస్తున్నారు.