వండర్ ఉమన్ వండ్రఫుల్ న్యూస్

వండర్ ఉమన్ వండ్రఫుల్ న్యూస్

వండర్ ఉమన్ వండ్రఫుల్ న్యూస్ గానే తెలుసు. కానీ, సూపర్ హీరోయిన్స్... అదేనండీ, సూపర్ హీరోలుగా సాహసాలు చేసే సూపర్ బ్యూటీస్... ఎక్కువగా పరిచయం ఉండదు. కానీ, హాలీవుడ్ లో ‘వండర్ ఉమన్’ ఆ పరిస్థితిని మార్చేసింది! సూపర్ హీరోలకు దీటుగా సూపర్ లేడీ కూడా ఫ్యాన్స్ ను అలరించింది! అయితే, ‘వండర్ ఉమన్’ ఇప్పుడు మరో కారణం చేత ‘వండర్ ఉమన్’ అనిపించుకుంటోంది! ‘వండర్ ఉమన్’ సినిమా రీసెంట్ గా విడుదలై రికార్డులు సృష్టించింది. లాక్ డౌన్ నేపథ్యంలోనూ తన సాహసాలతో గాల్ గాడోట్ ప్రేక్షకుల్ని గగుర్పాటుకి లోను చేసింది. ఆన్ లైన్లోనూ ఓటీటీ ప్లాట్ పామ్ పై దుమ్మురేపుతోంది. అయితే, ‘వండర్ ఉమన్’ తాజాగా ఓ వండ్రఫుల్ న్యూస్ అందించింది! ట్విట్టర్ లో ఆమె షేర్ చేసిన ఓ ఫోటో జనాల్ని ఆశ్చర్యపరిచింది. ఫ్యాన్స్ ని అయితే తెగ మురిసిపోయేలా చేసింది!

గాల్ గాడోట్ తన భర్త హాలీవుడ్ నిర్మాత జెరాన్ వార్సనో. ఆమెకి ఇప్పటికే ఇద్దరు కూతుళ్లు. భారతీయ ప్రేక్షకులు ఈపాటికే ఆశ్చర్యపోతారు. కానీ, ఆమె లెటెస్ట్ గా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫోటో సారాంశం... గాల్ గాడోట్ మూడోసారి ప్రెగ్నెంటట! తెరపై సాహసోపేతమైన విన్యాసాలు చేసే సూపర్ ఉమన్ నిజ జీవితంలో మూడోసారి తల్లి కావటం నిజంగా షాకింగ్ విషయమే. గ్లామర్ ఫీల్డ్ లోని అందాల రాశులు సాధ్యమైనంత వరకూ పెళ్లి, పిల్లలు వంటి అంశాల్ని వాయిదా వేస్తూ వస్తుంటారు. కానీ, 35 ఏళ్ల గాడోట్ భర్తతో కలసి ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లి అయింది. ‘మరోసారి’ అంటూ క్యాప్షన్ ఇచ్చి తాజాగా ట్విట్టర్ లో ఒక క్యూట్ ఫోటో షేర్ చేసింది. అందులో గాల్ గాడోట్ భర్త, ఇద్దరు కూతుళ్లు ఆమె పొట్టపై చేతులు వేసి కనిపించారు! దానర్థం వారి ఫ్యామిలీలోకి మరో కొత్త మెంబర్ రాబోతున్నారనే! చూడాలి మరి, ఆల్రెడీ ప్రెగ్నెంట్ అంటూ ప్రకటించిన ‘వండర్ ఉమన్’ సీక్వెల్ మూవీ షూటింగ్ లో ఎలా పాల్గొంటుందో! గతంలో ‘వండర్ ఉమన్’ పార్ట్ వన్ సెట్స్ మీద ఉండగా కూడా... గాల్ గాడోట్ గర్భవతే! అయినా 5నెలలు నిండే వరకూ అలానే నటించేసిందట! రియల్ ‘వండర్ ఉమనే’ కదా?