సి'తారలు' ఈర్ష్యపడే ఏక్తార (వీడియో)

సి'తారలు' ఈర్ష్యపడే ఏక్తార (వీడియో)

ఆర్టిస్టులంటే అందరికీ తెలిసింది సినిమా ఆర్టిస్టుల గురించే. వెండితెర మీద వెలిగినవాడే అద్భుతమైన కళాకారుడన్న అపప్రధ చాలా మందిలో ఉంది. కానీ ఈ వీడియోలో కనిపించే తమిళ తంబిని చూడండి. వారాంతపు సంతల్లో, తిరునాళ్లలో, వీధుల వెంట, రైల్వే స్టేషన్లలో ఏక్తారాలు అమ్ముకొని పొట్ట పోసుకుంటాడు. 

ఏక్ తార మీద సితారను మించిన రాగాలు ఎలా పలికిస్తున్నాడో చూడండి. స్వయంగా తయారు చేసిన ఏక్ తారల్ని వాయిస్తూ, సంగీతం అంటే ఇంత ఈజీనా అనిపించి.. మనమూ ఒకటి కొనుక్కొని ట్రై చేద్దాం.. అన్నంత స్ఫూర్తినిస్తున్నాడు.. సోషల్ మీడియాలో వేలాది మంది అభినందనలు అందుకొంటున్న ఈ అజ్ఞాత కళాకారుడి ఏక్ తార వాదాన్ని ఎంజాయ్ చేయండి.