ఇక చాలు: ఇమ్రాన్ ఖాన్

ఇక చాలు: ఇమ్రాన్ ఖాన్

యుద్ధమంటూ వస్తే ఇరుదేశాలకు మంచిదికాదు... కలిసి కూర్చుని మాట్లాడుకుందాం అని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...  యుద్ధం మొదలైతే తన చేతుల్లో గానీ, భారత ప్రధాని చేతుల్లో గానీ ఉండదని తెలిపారు. పుల్వామా ఘటనపై ఆధారాలు ఇవ్వాలని పలుసార్లు భారత్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. మా భూభాగంలోకి మీరు వచ్చారు.. మీ భూభాగంలోకి మేం వచ్చామన్నారు. పాక్‌ ఇవాళ చేపట్టిన దాడులను ప్రస్తావించారు. పుల్వామా, ఇతర అంశాలపై భారత్‌తో తాము చర్చకు సిద్ధమని తెలిపారు. ఇక చాలు.. ఇంతటితో ఆపేద్దాం అన్నారు.