అవకాశమిచ్చినా ఐపీఎల్‌లో ఆడను: అఫ్రిదీ

అవకాశమిచ్చినా ఐపీఎల్‌లో ఆడను: అఫ్రిదీ
పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది మరోసారి భారత్‌పై తన అక్కసు వెల్లగక్కాడు. మొన్నటికి మొన్న కశ్మీర్‌పై సంచలన ట్వీట్‌ చేసి భారతీయులకు ఆగ్రహం తెప్పించిన అఫ్రిదీ.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 'ఐపీఎల్‌ అంటే ఆసక్తి లేదు. భారత్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఐపీఎల్‌లో ఆడమని భారత్‌ నుంచి పిలుపొచ్చినా వెళ్లను. భవిష్యత్తులో మా పీఎస్‌ఎల్.. ఐపీఎల్‌ కంటే పెద్ద లీగ్‌గా అవతరిస్తుంది' అంటూ ఓ వెబ్‌సైట్‌తో వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)కు ప్రజాదరణ ఉందని, భవిష్యత్తులో ఐపీఎల్‌ కంటే పెద్ద టోర్నీగా తయారవుతుందని అన్నారు. ఈ వివరాలను ఆ వెబ్‌సైట్‌ ఎడిటర్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు. ఐపీఎల్‌ తొలి సీజన్‌లో డెక్కన్‌ చార్జర్స్‌ హైదరాబాద్‌ జట్టకు ప్రతినిధ్యం వహించిన అఫ్రిదీ.. ఆ సమయంలో ఐపీఎల్‌ను ప్రశంసిస్తూ ఆకాశానికెత్తాడు. కాగా.. భారత్‌-పాక్‌ల మధ్య నెలకొన్న వివాదంతో ఆ దేశ ఆటగాళ్లను ఐపీఎల్‌కు బీసీసీఐ అనుమతించడం లేదు. https://twitter.com/Saj_PakPassion/status/981627963606257664