వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ఉద్యోగుల‌కు షాక్.. ఇక ట్యాక్స్ బాదుడు..!?

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ఉద్యోగుల‌కు షాక్.. ఇక ట్యాక్స్ బాదుడు..!?

క‌రోనా వైర‌స్ ఉద్యోగుల‌ను క‌ష్టాల్లోకి నెట్టింది.. క‌రోనా దెబ్బ‌కు చిన్న సంస్థ‌లు చితికిపోయి ల‌క్ష‌ల్లో ఉద్యోగాలు ఉడిపోగా.. కొంద‌రికి జీతాల్లో కోత‌లు త‌ప్ప‌లేదు.. ఇక‌, కొన్ని సంస్థ‌లు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ఇవ్వ‌డంతో ఉద్యోగుల క‌ష్టాలు ఎక్కువ‌య్యాయి.. అస‌లే వేత‌నాల‌తో నెట్టుకొస్తున్న స‌మ‌యంలో.. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోంకు కావాల్సిన సౌక‌ర్యాలు స‌మ‌కూర్చుకోవ‌డం కూడా క‌ష్టంగా మారింది.. ఇలాంటి స‌మ‌యంలో వాళ్లు అద‌న‌పు ట్యాక్స్ క‌ట్టాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌న్న‌ వార్త గుబులు పుట్టిస్తోంది. ఎలా అంటే.. ఉద్యోగుల వేతన ప్యాకేజీలోని పలు అలవెన్స్‌లు ఉంటాయి. ఫ్యూయెల్ రీయింబర్స్‌మెంట్, ఎక్స్‌పెన్సెస్ కన్వెయన్స్ వంటి వాటిపై ఇప్పుడు పన్ను పడుతుంది. కోవిడ్ 19 కారణంగా దేశంలో చాలా ప్రాంతాల్లో స్థానిక సంస్థలు ట్రావెల్‌పై నిషేధం విధించడం ఇందుకు ప్రధాన కార‌ణంగా చెబుతున్నారు. 

అంటే, అలవెన్స్‌లపై పన్ను ప్రయోజనాలు.. ఖర్చు చేసినప్పుడే వర్తిస్తాయి. లేదంటే అవి పన్ను పరిధిలోకి వస్తాయని ట్యాక్స్ నిపుణులు చెబుతున్నారు.. దీని ప్ర‌భావం.. రూ.5 లక్షలలోపు శాలరీ ప్యాకేజ్ ఉన్న ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. అది ఎలా అంటే.. అలవెన్స్‌లు ట్యాక్స్ పరిధిలోకి రావడంతో ట్యాక్సబుల్ ఇన్‌కమ్ రూ.5 లక్షల లిమిట్‌ను దాటిపోతుంది. దీంతో అధిక పన్ను భారం మోయాల్సి రావొచ్చు. అలాగే పన్ను చెల్లింపుదారులకు ఎల్‌టీఏ క్లెయిమ్ చేసుకోవడానికి కూడా చాలా తక్కువ కాలం అందుబాటులో ఉంటుంది అంటున్నారు. మొత్తానికి వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ఉద్యోగులు.. అద‌న‌పు ట్యాక్స్ చెల్లించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. కరోనా వైరస్ కారణంగా కొన్ని ఉద్యోగాలు ఊడిపోగా.. ఉన్న ఉద్యోగులపై కూడా ప్రతికూల ప్రభావం ప‌డుతోంది.