వర్క్‌ ఫ్రమ్ హోం ఎఫెక్ట్.. అనూహ్యంగా పెరిగిన డేటా డిమాండ్..

వర్క్‌ ఫ్రమ్ హోం ఎఫెక్ట్.. అనూహ్యంగా పెరిగిన డేటా డిమాండ్..

కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో పెద్దసంఖ్యలో ఉద్యోగులు, వ్యాపారులు ఇంటి నుంచే పని చేసేందుకు మొగ్గుచూపుతుండటంతో డేటాకు అనూహ్యంగా డిమాండ్‌ పెరిగింది. మొత్తం ఇంటర్‌నెట్‌ ట్రాఫిక్‌ 10 శాతం పైగా పెరిగిందని టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా డాంగల్స్‌కూ డిమాండ్‌ రెట్టింపవడంతో రిటైలర్లు స్టాక్‌ తెప్పించేందుకు వారం సమయం కోరుతున్నారు. ఇంటర్నెట్ ట్రాఫిక్‌ 10 శాతం పెరిగిందని తమ టెలికాం సభ్యుల నుంచి సమాచారం అందిందని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మ్యాథ్యూస్‌ వెల్లడించారు. ట్రాఫిక్‌ అనూహ్యంగా పెరగడంతో నెట్‌వర్క్‌లు స్తంభించే అవకాశం లేదని ఆయన తెలిపారు. డేటా డిమాండ్‌ పెరిగిన ఫలితంగా సమస్యలు ఎదురుకాబోవని.. నెట్‌వర్క్స్‌ అన్నీ తగిన సామర్థ్యంతో కూడుకని ఉన్నాయని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు.