అప్పుడు కూడా పని చేశా: లావణ్య త్రిపాఠీ

అప్పుడు కూడా పని చేశా: లావణ్య త్రిపాఠీ

యంగ్ హీరో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠీ జంటగా నటించిన తాజా సినిమా ఏ1 ఎక్స్‌ప్రెస్. ఈ సినిమా చిత్రీకరణ ముగించుకొని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా హాకీ నేపథ్యంలో తెరకెక్కతోంది. ఈ సినిమాను డిన్నిస్ జీవన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాపై సందీప్ కిషన్ మంచి నమ్మకంగా ఉన్నారు. అయితే హీరోయిన్ లావణ్య ఇటీవల ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండనుందని ఆమె అన్నారు. ‘ఏ1 ఎక్స్‌ప్రెస్ రీమేక్ సినిమా అయినప్పటికీ అనేక మార్పులు జరిగాయి. దాదాపు యాభై శాతం స్క్రిప్ట్ మారింది. ఈ సినిమా కోసం నేను కూడా హాకీ నేర్చుకున్నారు. హాకీ కనిపించినంత తేలిక కాదు, చాలా కష్టం. ఈ సినిమా కోసం నేను తీవ్ర జ్వరంలో ఉన్నప్పుడు కూడా షూటింగ్‌కు హాజరు అయ్యాను‘ అని లావణ్య తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పారు.