గుజరాత్ లో వలసకూలీలపై దాడులు

గుజరాత్ లో వలసకూలీలపై దాడులు

గుజరాత్ లో వందలాది వలసకూలీలపై దాడులు జరుగుతున్నాయి. 14 నెలల చిన్నారిపై బీహర్ కు చెందిన వలసకూలీలు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ల నుంచి వచ్చిన వలస కూలీలపై గుజరాతీలు దాడులకు పాల్పడుతున్నారు. దీంతో గాంధీనగర్‌, అహ్మదాబాద్‌, పటాన్‌, సబర్‌కాంత, మెహ్సానా ఏరియాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వరుస దాడులతో వలసకూలీలు తమ స్వంత రాష్ట్రాలకు చేరుకునేందుకు రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్నారు. దాడులకు పాల్పడ్డ సుమారు 150 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. గస్తీ పెంచామని వలసకూలీలపై ఎటువంటి దాడులు జరగవని పోలీసులు అంటున్నారు.