భయపెడుతున్న సత్యం: ప్రతి 100 మందిలో 40 మందికి ఆ మహమ్మారి... 

భయపెడుతున్న సత్యం: ప్రతి 100 మందిలో 40 మందికి ఆ మహమ్మారి... 

ప్రపంచాన్ని భయపెడుతున్న జబ్బుల్లో క్యాన్సర్ కూడా ఒకటి.  గతంలో క్యాన్సర్ అంటే భయపడేవారు.  కానీ, ఇప్పుడు మనిషికి క్యాన్సర్ అన్నది సర్వసాధారణం అయ్యింది.  మనిషి తీసుకుంటున్న ఆహరం, అతని వ్యాపకం, అలవాట్లను బట్టి కూడా క్యాన్సర్ వస్తున్నది.  భయపెట్టే నిజం ఏమిటంటే ఇప్పడు ప్రపంచంలో  ప్రతి 100 మందిలో 40 మందికి క్యాన్సర్ ఉన్నట్టుగా గణాంకాలు చెప్తున్నాయి.  

మనిషికి మొత్తం 7 రకాల క్యాన్సర్ సోకుతుంది.  క్యాన్సర్ పై ప్రపంచ దేశాలన్ని పరిశోధన చేస్తున్నాయి. ఎక్కువగా టెన్షన్ పడటం వలన కూడా మనిషి క్యాన్సర్ బారిన పడటానికి అవకాశం ఉంటుంది.  క్యాన్సర్ వలన ప్రతి ఏటా లక్షలమంది మరణిస్తున్నారు.  క్యాన్సర్ సోకిన వెంటనే గుర్తిస్తే ఆ వ్యాధిని క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది.  చికిత్స ఆలస్యం అవుతున్న కొద్దీ మరణానికి చేరువౌతున్నట్టే లెక్క.  అయితే, క్యాన్సర్ పై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు కొన్ని బయటపడ్డాయి.  కుక్కలకు వాసనచూసే శక్తి ఎక్కువగా ఉంటుంది.  కుక్కలు క్యాన్సర్ కణాలను వాసన చూసి పసిగట్టడంలో ముందు ఉంటాయని పరిశోధకులు చెప్తున్నారు.  కుక్కలు క్యాన్సర్ ను మొదటిదశలోనే గుర్తిస్తున్నాయి.  అందుకే ఈవైపుగా శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు.