ధావన్- రోహిత్ ల జోడీ అరుదైన ఘనత
వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనింగ్ జోడి శిఖర్ ధావన్-రోహిత్ శర్మలు అరుదైన ఘనత సాధించారు. ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో అత్యధికంగా వంద, అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన రెండో జోడిగా నిలిచింది. ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో రోహిత్-ధావన్‌ల జంటకు ఇది ఆరో సెంచరీ భాగస్వామ్యం. ఫలితంగా ఆడమ్ గిల్‌క్రిస్ట్-మ్యాథ్యూ హేడెన్‌ల సరసన వీరు నిలిచారు.
అలాగే, వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఆసీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శిఖర్ ధావన్ సెంచరీ సాధించడంతో భారత్ 27వ వరల్డ్‌కప్ సెంచరీని ఖాతాలో వేసుకుంది. ఫలితంగా ఆసీస్‌ను వెనక్కు నెట్టిన భారత్ అగ్రస్థానానికి వచ్చింది. శిఖర్ ధావన్ సెంచరీ సాధించడం ద్వారా భారత్ ఈ మార్కును చేరింది. ఆసీస్‌తో మ్యాచ్‌లో ధావన్ సెంచరీతో మెరిశాడు. 109 బంతులు ఎదుర్కొన్న ధావన్ 16 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)