లండన్ చేరుకున్న విరాట్ సేన

లండన్ చేరుకున్న విరాట్ సేన

ప్రపంచ కప్ 2019 కోసం భారత క్రికెట్ జట్టు బుధవారం లండన్ చేరుకుంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా తన మొదటి వార్మప్ మ్యాచ్ మే 25న న్యూజిలాండ్ తో ఆడుతుంది. అన్ని విధాలుగా బలంగా కనిపిస్తున్న భారత జట్టు తన మూడో వరల్డ్ కప్ ని ముద్దాడేందుకు ఉరకలేస్తోంది. వరల్డ్ కప్ 2019 టోర్నమెంట్ లో భారత్ తన మొదటి మ్యాచ్ జూన్ 5న దక్షిణాఫ్రికాతో ఆడనుంది.

50-50 ఓవర్ ఫార్మాట్ వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ మొదటి సారి భారత క్రికెట్ జట్టుకి నాయకత్వం వహిస్తున్నాడు. టోర్నమెంట్ లో టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్న భారత్, చివరిసారి 2011లో వరల్డ్ కప్ గెలిచింది.