రవిశాస్త్రికి వరల్డ్ కప్ ఎఫెక్ట్??
వరల్డ్‌కప్‌లో సెమీస్‌లోనే టీమిండియా ఇంటిదారి పట్టడంతో కోచింగ్ స్టాఫ్ ప్రక్షాళన చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలిసింది. హెడ్ కోచ్ రవిశాస్త్రితోపాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ల తప్పించాలని నిర్ణయించినట్టు సమాచారం. వరల్డ్‌కప్‌తో వీరందరి కాంట్రాక్ట్ ముగిసినా.. వచ్చే నెలలో ప్రారంభమ్యే విండీస్ టూర్ వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో టీమిండియా కోచింగ్ స్టాఫ్ కోసం బీసీసీఐ త్వరలో ఓ ప్రకటన విడుదల చేయబోతోంది.
సెప్టెంబర్‌లో జరిగే సౌతాఫ్రికా సిరీస్ నాటికి కొత్త కోచ్‌ను ఎంపిక చేయాలన్నదే బీసీసీఐ ప్లాన్. 2017లో టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రవిశాస్త్రి హయాంలో ఆసీస్ సిరీస్ మినహా భారత్ ఎటువంటి కీలక టోర్నీలూ గెలవలేదు. ఇక.. కోచ్‌గా కొనసాగాలని రవిశాస్త్రికి ఆసక్తి ఉంటే అతను కూడా దరఖాస్తు చేయాల్సిందేనని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)