భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై కోహ్లీ ఏమన్నాడంటే..

భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై కోహ్లీ ఏమన్నాడంటే..

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. వచ్చే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌పై పలువురు భారత మాజీ క్రికెటర్లు తమతమ అభిప్రాయాలను వెల్లడించారు. కొందరు పాక్‌తో మ్యాచ్‌ ఆడాలని, మరొకొందరు వద్దని అంటున్నారు. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ కూడా తన అభిప్రాయాన్ని తెలిపారు. ఆదివారం విశాఖ‌లో ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో విరాట్ మీడియాతో మాట్లాడారు.

'పుల్వమా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలి. పుల్వామా ఘటనపై ఎన్నో దేశాలు స్పందించి ఖండించాయి. భారతీయుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత కెప్టెన్‌గా నా మీద ఉంది. అందుకే భారత ప్రభుత్వం, బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేం కట్టుబడి ఉంటాం. ఆ నిర్ణయాన్ని గౌరవిస్తాం' అని విరాట్ తెలిపారు.