వరల్డ్‌కప్‌లో ఇవాళ బిగ్‌ఫైట్‌

వరల్డ్‌కప్‌లో ఇవాళ బిగ్‌ఫైట్‌

వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌లో న్యజిలాండ్‌ను ఢీ కొట్టేదెవరో ఇవాళ తేలిపోనుంది. ఈ మెగా టోర్నీలో రెండు సెమీఫైనల్‌ మ్యాచ్‌ నేడు జరగనుంది. బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇవాళ ఆతిథ్య ఇంగ్లండ్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాలు తలపడబోతున్నాయి. వరుస విజయాలతో ఆస్ట్రేలియా సెమీస్‌లో అడుగుపెట్టగా.. అతికష్టమ్మీద ఇంగ్లండ్‌ ఇక్కడి వరకు వచ్చింది. చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాల ఈసారి ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉంది ఇంగ్లండ్‌ జట్టు. మరో టైటిల్‌పై కన్నేసిన ఆసీస్‌.. ఇంగ్లండ్‌ జట్టును తేలిగ్గా తీసుకోకూడదని భావిస్తోంది. ఏది ఏమైనా ఇవాళ ఆసక్తికర పోరు ఖాయంగా కనిపిస్తోంది. 

ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ వార్నర్‌, ఫించ్‌, స్టీవ్‌ స్మిత్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండగా.. బౌలర్లు స్టార్క్‌, కమిన్స్‌, స్టొయినిస్‌, బెహ్రెన్‌డార్ఫ్‌లు అంచనాలకు మేర రాణిస్తున్నారు. ఇక.. ఇంగ్లండ్‌ జట్టు విషయానికి వస్తే జాసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టో, జో రూట్‌, కెప్టెన్‌ మోర్గాన్‌, బట్లర్‌ సహా బ్యాట్స్‌మెన్‌ మొత్తం సత్తాచాటుతున్నారు. మార్క్‌ ఉడ్‌, ఆర్చర్‌, క్రిస్‌వోక్స్‌, స్టోక్స్‌లతో కూడిన బౌలింగ్‌ లైనప్ ఈ జట్టుకు ప్రధాన బలం.