వరల్డ్ ఫేమస్ లవర్ ఎలా ఉందంటే... 

వరల్డ్ ఫేమస్ లవర్ ఎలా ఉందంటే... 

విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది.  ఇప్పటికే యూఎస్ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు వేశారు.  సినిమాపై భారీ నమ్మకం ఉన్నది.  మూడు విభిన్నమైన ప్రేమకథలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టాక్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నది.  

విజయ్ దేవరకొండకు జోడిగా నలుగురు హీరోయిన్లు ఇందులో నటిస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమా గురించి ట్విట్టర్ లో అభిమానులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.  సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందని, క్రాంతి మాధవ్ బాగా తీశారని అంటున్నారు.  విజయ్ దేవరకొండ తన నటనతో ఆకట్టుకున్నాడని ట్వీట్ చేస్తున్నారు.  రాశి, ఐశ్వర్య, కేథరిన్ ల నటన ఆకట్టుకునే విధంగా ఉన్నట్టు చెప్తున్నారు. కాన్సెప్ట్ పరంగా సినిమా బాగున్నా, ఎంతమేరకు ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందో చూడాలి అని కొందరు ట్వీట్ చేస్తుండటం విశేషం. హైదరాబాద్ లో ఈరోజు మొత్తం 500 షోలు వేస్తుండగా ఇప్పటికే అన్ని షోలు బుక్ కావడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి రిపోర్ట్స్ రావాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.