రూ.500 కోట్లు ఖర్చుపెట్టి కూతురు పెళ్లి చేసి... దివాళా తీసిన వ్యాపారి...!

రూ.500 కోట్లు ఖర్చుపెట్టి కూతురు పెళ్లి చేసి... దివాళా తీసిన వ్యాపారి...!

ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అంటే సామెత గురించి అందరికి తెలుసు.  ఆడంబరాలకు పోయి సంపాదించినా డబ్బును వృధాగా ఖర్చు చేస్తే చివరికి రోడ్డున పడాల్సి వస్తుంది.  అది సామాన్యులైన సరే వ్యాపారవేత్తలైనా సరే.  లండన్ కు చెందిన ఇండియన్ వ్యాపార వేత్త ప్రమోద్ మిట్టల్ వ్యాపారం దివాళా తీసింది.  కోట్ల రూపాయల మేర అప్పుల పాలయ్యాడు.  ప్రపంచంలో రిచెస్ట్ స్టీల్ వ్యాపారిగా పేరున్న లక్ష్మి మిట్టల్ సోదరుడు ప్రమోద్ మిట్టల్ దివాళా తీశాడు.  అయనకు 24 వేల కోట్ల రూపాయల మేర అప్పులు ఉన్నట్టు తేలింది.  

2013 వ సంవత్సరంలో ప్రమోద్ మిట్టల్ తన కూతురు శ్రేష్టి వివాహం జరిపించాడు.  ఆ వివాహం కూడా సాదాసీదాగా కాదు.  వివాహానికి రూ.500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి వివాహం జరిపించాడు.  2006 లో ప్రమోద్ మిట్టల్ బోస్నియన్ కోక్ తయారీ కంపెనీ జీఐకేఐఎల్ రుణాలకు తన గ్లోబల్ స్టీల్ హోల్డింగ్ తరపున హామీ సంతకం పెట్టాడు.  అయితే, జీఐకేఐఎల్ రుణాలను చెల్లించలేకపోవడంతో, రుణాలు ఇచ్చిన మార్గెట్ కంపెనీ 166 మిలియన్ ఆలర్ల కోసం కోర్టుకు లాగింది.  ఆ మొత్తాన్ని మిట్టల్ చెల్లించలేకపోవడంతో అయన దివాళా తీశాడు.