ఏపీకి నిధులపై ప్రపంచ బ్యాంక్‌ కీలక ప్రకటన

ఏపీకి నిధులపై ప్రపంచ బ్యాంక్‌ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌కు నిధుల కేటాయింపుపై ప్రపంచ బ్యాంకు కీలక ప్రకటన చేసింది. రాజధాని ప్రాజెక్టు నుంచి తాము తప్పుకున్నప్పటికీ ఏపీ అభివృద్ధి విషయంలో సహకారం అందిస్తామని పేర్కొంది. వ్యవసాయం, వైద్యం, విద్యుత్, విపత్తు నివారణ వంటి రంగాలకు ఒక బిలియన్ డాలర్లు అందించేందుకు అంగీకరించింది. అమరావతి డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకు మద్దతివ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతోనే ఆ వ్యవహారం నుంచి వరల్డ్‌ బ్యాంక్‌ తప్పుకున్నట్టు తెలిసింది. 

ఈక్రమంలోనే.. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ద్వారా తమకు ప్రతిపాదనలు పంపితే పరిశీలించి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రపంచబ్యాంక్‌ తెలిపింది. ఇక.. గత నెల 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆరోగ్య రంగంలో 328 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం అందిస్తామని స్పష్టం చేసింది.