వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌ సంచలనం

వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌ సంచలనం

వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికాకు భారీ షాక్‌ తగిలింది. బంగ్లాదేశ్‌ చేతిలో ఘోర పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికాను 21 పరుగుల తేడాతో ఓడించింది బంగ్లాదేశ్‌.

ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణిత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. ఓపెనర్ తమిమ్ ఇక్బాల్(16; 29 బంతుల్లో, 2 ఫోర్లు) తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరారు. సౌమ్య సర్కార్ (42; 30 బంతుల్లో, 9 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. క్రిస్ మోరిస్ బౌలింగ్ లో కీపర్ డీకాక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తరువాత వచ్చిన షకీబ్ అల్ హసన్ (75; 84 బంతుల్లో 9 ఫోర్లు), ముష్ఫీకర్ రహీమ్ (78; 80 బంతుల్లో 8 ఫోర్లు) చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు. మహ్మద్ మితున్ (21; 21 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్), మోసద్దీక్ హోస్సెన్ (26; 20 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. చివర్లో మహ్మదుల్లా (46; 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) వీరవిహారం చేయడంతో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలింగ్ లో ఇమ్రాన్ తాహీర్, క్రిస్ మోరిస్, ఆండిల్ తలో రెండు వికెట్లు తీశారు. 

భారీ టార్గెల్‌ను ఛేజ్‌ చేసేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు మార్‌క్రమ్‌ (45), డికాక్‌ (23) శుభారంబాన్ని ఇచ్చారు. డికాక్‌ రనౌటవగా.. క్రీజ్‌లోకి వచ్చిన డుప్లెసిస్‌.. మార్‌క్రమ్‌, మిల్లర్‌లతో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. జట్టును గెలిపిస్తాడనుకున్న డుప్లెసిస్‌.. 62 పరగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వాండర్‌డసెన్‌ (41), డుమిని (45)లు చెప్పుకోదగ్గ స్కోరు చేసినా జట్టును గెలిపించలేకపోయారు. 18 బంతుల్లో 44 పరుగులు చేయాల్సిన స్థితిలో డుమినిని ముస్తాఫిజుర్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో బంగ్లాకు గెలుపు లాంఛనంగా మారింది.