ప్రపంచకప్‌ ప్రారంభ వేడుకలు నేడే..

ప్రపంచకప్‌ ప్రారంభ వేడుకలు నేడే..

క్రికెట్‌ మహా సంగ్రామానికి అదిరిపోయే రీతిలో ప్రారంభ వేడుకలు నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సిద్ధమైంది. కనివినీ ఎరుగని రీతిలో ఓపెనింగ్ సెర్మనీని ప్లాన్ చేస్తోంది. ఆతిథ్య ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రేపు జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్‌ ప్రారంభమవుతుంది. కానీ..  మెగా టోర్నీ సంబరాలు మాత్రం ఇవాళ్టి నుంచే మొదలవనున్నాయి. సెంట్రల్‌ లండన్‌లోని ప్రఖ్యాత వెస్ట్‌మినిస్టర్‌ సిటీ రోడ్‌లోని 'ది మాల్‌' వేదికగా ప్రపంచకప్‌ ప్రారంభ వేడుకలు ఇవాళ జరగనున్నాయి. క్రికెట్, మ్యాజిక్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కలగలిసి సంబరాలు ఉంటాయి. సుమారు గంటసేపు జరిగే ఈ ప్రోగ్రామ్‌ను ప్రత్యక్షంగా నాలుగువేల మంది వీక్షించనున్నారు. పలు చానెళ్లలో కూడా ప్రపంచవ్యాప్తంగా లైవ్‌ టెలికాస్ట్‌ కానుంది.