వరల్డ్‌కప్‌కి శ్రీలంక జట్టు ఇదే..
మే 30 నుంచి ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్ కోసం జట్టును శ్రీలంక సెలక్టర్లు ఇవాళ ప్రకటించారు. కెప్టెన్సీ రేసులో ఉన్న దినేశ్ చండిమాల్, ఉపుల్ తరంగాకి కనీసం జట్టులో చోటు దక్కకపోగా.. 2015 తర్వాత శ్రీలంక తరఫున కనీసం ఒక్క వన్డే మ్యాచ్‌లో కూడా ఆడని దిముత్ కరుణరత్నెకు పగ్గలు అప్పజెప్పారు. సీనియర్ లసిత్ మలింగను ఎంపిక చేసిన సెలెక్టర్లు.. నిరోషన్ డిక్వెల్లా, అఖిల ధనంజయకు నిరాశే మిగిల్చారు. గత రెండున్నరేళ్లలో జట్టు కెప్టెన్‌గా నలుగురిని మార్చిన శ్రీలంక క్రికెట్ బోర్టు.. అనూహ్యంగా కరుణరత్నెను ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
జట్టు వివరాలు..
దిముత్ కరుణరత్నె (కెప్టెన్), ఏంజిలో మాథ్యూస్, తిసార పెరీరా, కుశాల్ పెరీరా, ధనుంజయ డిసిల్వా, కుశాల్ మెండిస్, లసిత్ మలింగ, ఇసురు ఉదాన, మిలింద సిరివర్ధనె, ఫెర్నాండో, జీవన్ మెండిస్, తిరుమానె, జెఫ్రీ వండర్‌సాయ్, నువాన్ ప్రదీప్, లక్మల్
Sri Lanka squad for ICC #CWC19 ???????? pic.twitter.com/d0WGDzVqJ7
— Sri Lanka Cricket (@OfficialSLC) April 18, 2019
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)