వరల్డ్‌కప్‌లో ఇవాళ..

వరల్డ్‌కప్‌లో ఇవాళ..

వరల్డ్‌కప్‌లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు సర్వం సిద్ధమైంది. ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టుతో పాకిస్థాన్‌ తలపడబోతోంది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్‌.. ఇవాళ గెలిచి టోర్నీలో బోణీ కొట్టాలని భావిస్తోంది. మరోవైపు.. తొలి మ్యాచ్‌లోనే విజయం నమోదు చేసి మెగా టోర్నీలో అదిరే ఆరంభం ఇచ్చిన ఇంగ్లండ్‌.. అదే జోరు కొనసాగించాలని ప్లాన్‌ చేసుకుంది.  
గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమవుతాడని భావించిన బంగ్లాదేశ్‌ మష్రాఫె మొర్తజా ఫిట్‌నెస్‌ సాధించడం ఆ జట్టుకు కొండంత బలం. తొలి మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన సఫారీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ ఇవాళ్టి మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం లేదని తెలుస్తోంది.