పింక్ టెస్టులో ఇంగ్లాండ్ పేరిట చెత్త రికార్డు...

పింక్ టెస్టులో ఇంగ్లాండ్ పేరిట చెత్త రికార్డు...

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన పింక్ టెస్ట్ ఇంగ్లాండ్ జట్టుకు ఒక చెత్త రికార్డును మిగిల్చింది. రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే చాప చుట్టేసి.. 38 ఏళ్ల తర్వాత చెత్త రికార్డును నమోదు చేసింది. భారత్‌పై అత్యల్ప స్కోరుకే ఆలౌట్‌ అయ్యింది ఇంగ్లీష్‌ టీం. 1983-84లో క్రైస్ట్‌చర్చి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 93 పరుగులకే ఆలౌట్‌ అయిన ఇంగ్లాండ్ .. రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులకే కుప్పకూలింది. అప్పట్లో ఆ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 175 పరుగులు మాత్రమే చేసింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఫాలోఆన్‌ ఆడి రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులకే ఆలౌట్‌ కావడంతో న్యూజిలాండ్‌ 132 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.