విర‌సం నేత వ‌ర‌వ‌ర‌రావుకు క‌రోనా...

 విర‌సం నేత వ‌ర‌వ‌ర‌రావుకు క‌రోనా...

విర‌సం నేత వ‌ర‌వ‌ర‌రావు ఆరోగ్య‌ప‌రిస్థితిపై ఎప్ప‌టి నుంచో కుటుంబ‌స‌భ్యులు, ప్ర‌జాసంఘాల నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.. ముంబై జైలులో 80 ఏళ్ల వ‌ర‌వ‌ర‌రావు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుండ‌డంతో.. ఆయ‌న‌ను విడుద‌ల చేయాల‌నే డిమాండ్ ఉంది. ఇక‌, జులై 11వ తేదీన ఆయన‌ నుంచి కుటుంబ‌స‌భ్యుల‌కు ఫోన్ రావ‌డం.. ఆయ‌న స‌రిగా మాట్లాడ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నార‌ని.. వారు ఆందోళ‌న వ్య‌క్తం చేసిన త‌ర్వాత‌.. చివ‌ర‌కు వ‌ర‌వ‌ర‌రావును ముంబై జైలు నుంచి నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. అస‌లే వృద్ధాప్యంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయ‌న‌కు తాజాగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది.. దీంతో.. కుటుంబ‌స‌భ్యుల్లో ఆందోళ‌న మొద‌లైంది.. ఆయ‌న క‌రోనా బారిన‌ప‌డ‌డంతో.. జేజే ఆస్ప‌త్రి నుంచి సెయింట్ జార్జ్ ఆసుపత్రికి త‌ర‌లించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.