చైనా మెడకు వుహాన్ ఉచ్చు... ఆందోళనలో ప్రజలు... 

చైనా మెడకు వుహాన్ ఉచ్చు... ఆందోళనలో ప్రజలు... 

80 రోజులపాటు హుబె ప్రావిన్స్ లో ఏం జరిగిందో... అక్కడి ప్రజలు ఎలా ఇళ్లకే పరిమితం అయ్యారో తెలియదు.  ఇంటి నుంచి ప్రజలు బయటకు రాకుండా ప్రభుత్వం ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిందో కూడా బయటకు పెద్దగా తెలియదు. చైనా మిగతా ప్రాంతాలపై పెద్దగా ఆంక్షలు లేనప్పటికీ హుబె ప్రావిన్స్ పై మాత్రం భారీ ఆంక్షలు విధించింది చైనా ప్రభుత్వం.  

కరోనా తగ్గుముఖం పట్టింది.  దీంతో 80 రోజుల నిర్బంధం తరువాత వుహాన్ ప్రజలు బయటకు వస్తున్నారు.  బయట వాతావరణం చూసి సంతోషపడటం అనే సంగతి పక్కన పెడితే, ప్రజల్లో తెలియని అశాంతి, అసహనం నెలకొన్నాయి.  బయటకు వచ్చిన ప్రజలు ఆందోళన చేస్తున్నారు.  షాపులు తెరిచే పరిస్థితి లేదు.  అద్దెలు కట్టే స్థితి లేదు.  షాపులు తీయకుంటే ఆదాయం రాదు.  అద్దెలు కట్టకుంటే షాపుల యాజమాన్యం ఒప్పుకోదు.  కొంతకాలం పాటు అద్దెల నుంచి మాఫీ ఇవ్వాలని వ్యాపారాలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.  కానీ, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  పోలీసులు సైతం ప్రజల గురించి పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.