ఎంఐ ఏ2.. ఆగస్ట్ 8 విడుదల

ఎంఐ ఏ2.. ఆగస్ట్ 8 విడుదల

భారత మార్కెట్లో సంచలనం సృష్టిస్తూ నెంబర్ వన్ బ్రాండ్ గా ఎదిగిన చైనా మొబైల్ సంస్థ షియోమీ, మరో హ్యాండ్ సెట్ విడుదల చేయడానికి సిద్ధమైంది. ఆగస్ట్ 8న తన కొత్త స్మార్ట్ ఫోన్ ఎంఐ ఏ2ని విడుదల చేస్తోంది. తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఏ2 విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక పోస్ట్ పెట్టింది. ఎంఐ ఏ2లో క్వాల్ కామ్ సరికొత్త స్నాప్ డ్రాగన్ 660 ఎస్ఓసీ ప్రాసెసర్ అమర్చినట్టు తెలిపేందుకు ఎక్కువ మంది భారతీయులు ఇష్టపడే ఆహారం వరిని ఉంచి మధ్యలో 660 సంఖ్యను ఎర్ర కందిపప్పుతో తీర్చిదిద్దిన ఫోటోను ఉంచింది. దీంతో హై పెర్ఫామెన్స్ అనుభవంలోకి వస్తుందని తెలిపింది. ఈ ఫోటోను కూడా డ్యూయల్ కెమెరాలు ఉన్నా ఎంఐ ఏ2తోనే తీసినట్టు రాసింది.