ఎంఐ యాప్స్‌లోనూ మ్యూజిక్‌ మస్తీ

ఎంఐ యాప్స్‌లోనూ మ్యూజిక్‌ మస్తీ

లేటెస్ట్‌ ఫీచర్స్‌, ట్రెండింగ్‌ అప్‌డేట్స్‌తో ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకుంటున్న షియోమి.. మరో సూపర్‌ అప్‌డేట్‌ను అందించనున్నది. ఎంఐ వీడియో, మ్యాజిక్‌ యాప్స్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతోంది. ఫొన్‌ స్టోరేజ్‌లో ఉన్న వీడియోలు, ఆడియోలు ప్లే చేసేందుకే ఇప్పటివరకు ఈ యాప్స్‌ ఉపయోగపడేవి. ఇకపై ఆన్‌లైన్‌ కంటెంట్‌ను కూడా ఈ యాప్స్‌ ద్వారా వీక్షించేందుకు, వినేందుకు వివిధ సంస్థలతో షియోమి ఒప్పందం కుదుర్చుకుంది. అంటే.. ఇకపై ఎంఐ వీడియో ద్వారా  సోనీ ఎల్‌ఐవీ, హంగామా ప్లే, ఆల్ట్‌ బాలాజీ, జీ5, వీఐయూ, టీవీఎఫ్‌లో కంటెంట్‌ను స్ట్రీమ్‌ చేసుకోవచ్చు. 'హంగామా'తో జతకట్టి 13 భాషల్లోని కోటికిపైగా పాటలను ఎంఐ మ్యూజిక్‌ ద్వారా వినొచ్చు. 'డైనమిక్‌ లరిక్‌' ఫీచర్‌.. ఎంఐ మ్యాజిక్‌ యాప్‌కు అదనపు ఆకర్షణ. ఈరోజు నుంచి ఎంఐ మ్యూజిక్‌, మరో వారం రోజుల్లో ఎంఐ వీడియో యాప్స్‌లో ఈ అప్‌డేటెడ్‌ ఫీచర్స్‌ యాక్టివేట్‌ అవుతాయి.