ఈ నెల 25న 'షియోమీ ఎంఐ 6ఎక్స్' విడుదల

ఈ నెల 25న 'షియోమీ ఎంఐ 6ఎక్స్' విడుదల
స్మార్ట్‌ఫోన్ రంగంలో ఒకటికి మించి మరొకటి కొత్త ఫోన్లను రిలీస్ చేస్తూ స్మార్ట్‌ఫోన్ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఇతర కంపెనీలతో పోటీపడుతూ దూసుకుపోతుంది చైనాకు చెందిన షియోమీ స్మార్ట్‌ఫోన్ సంస్థ. షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎంఐ 6ఎక్స్‌ను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధర వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. షియోమీ ఎంఐ 6ఎక్స్ ఫీచర్లు ఇలా ఉన్నాయి. 5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 20. 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.