షియోమీ నుండి మరో స్మార్ట్‌ఫోన్‌

షియోమీ నుండి మరో స్మార్ట్‌ఫోన్‌

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ షియోమీ నుండి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్ లోకి రానుంది. షియోమీ సంస్థ ఎంఐ ఎ2, ఎంఐ ఎ2 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ లను స్పెయిన్ మార్కెట్లో విడుదల చేసింది. ఆగస్టు 8వ తేదీన ఎంఐ ఎ2ని భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ మేరకు షియోమీ ఇండియా అధిపతి మను కుమార్ జైన్ ఓ ప్రకటనలో తెలిపారు. 3/4/6 జీబీ రామ్ లతో ఎంఐ ఎ2 ఫోన్ ని విడుదల చేయనున్నారు.

# 3జీబీ ర్యామ్ 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.20,000. 
# 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.22,500. 
# 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.28,100. 

5.99 ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌ డ్రాగన్ 660 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 12/20  మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా, 20 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఫింగర్‌ ప్రింట్ సెన్సార్, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి.